ఐశ్వర్య పయనం! | Aishwarya Arjun talks about her journey | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య పయనం!

Apr 5 2026 12:48 AM | Updated on Apr 5 2026 12:48 AM

Aishwarya Arjun talks about her journey

యాక్షన్  కింగ్‌ అర్జున్‌ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ఐశ్వర్య అర్జున్‌. అతికొద్ది రోజుల్లోనే తన నటనతో మెప్పించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఇప్పుడు తెలుగు తెరపై ‘సీతా పయనం’ మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం...

క్రమశిక్షణ నా బలం
క్లాసికల్‌ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడం వల్ల కావచ్చు, క్రమశిక్షణ అనేది నా రక్తంలోనే ఉంది. ఫిట్‌నెస్‌ విషయంలో కూడా నేను చాలా కట్టుదిట్టంగా ఉంటాను. యోగా చేయకుండా నా రోజు గడవదు.

విమర్శలే ఇష్టం
సోషల్‌ మీడియాలో నా గురించి వచ్చే వార్తల కంటే, నా పని గురించి వచ్చే విమర్శలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అవే మనల్ని మంచి నటిగా మారుస్తాయని నమ్ముతాను.

నాన్న చాలా స్ట్రిక్ట్‌
బెంగళూరులో పుట్టాను. కాని, నా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. సేక్రెడ్‌ హార్ట్‌ స్కూల్, తర్వాత స్టెల్లా మేరీస్‌ కాలేజీలో బీకామ్‌ పూర్తి చేశాను. ఫ్యామిలీ మొత్తం సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా, చదువు విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు.

వెనుక పెద్ద పేరు ఉన్నా...
వెనుక ‘అర్జున్  సర్‌’ అనే పెద్ద పేరు ఉండొచ్చు. కాని, సెట్స్‌లోకి వెళ్లినప్పుడు నేను కేవలం ఒక నటిని మాత్రమే. ‘పట్టాతు యానై’తో నా ప్రయాణం మొదలైనప్పుడు నాన్న చెప్పిన ఒకే మాట ఇప్పటికీ గుర్తుంది ‘‘నువ్వు చేసే పనికి వంద శాతం న్యాయం చెయ్, మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.’’ ఆ మాటలను ఇప్పటికీ పాటిస్తాను.

ఫ్యాషన్ పై ఆసక్తి
యూకేలోని బర్మింగ్‌హామ్‌ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాను. గ్లామర్‌ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే, నేను కచ్చితంగా ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడేదాన్ని. అందుకే నా దుస్తుల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.

ఇంటి వంటలంటే ఇష్టం
ఎన్నో రకాల ఇంటర్నేషనల్‌ వంటకాలు తిన్నా, ఇంట్లో చేసే వేడి వేడి అన్నం, పప్పు రుచే వేరు. వీకెండ్స్‌లో నా చెల్లెలు అంజనతో కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాను. అలాగే నాన్నతో కలిసి అప్పుడప్పుడు లాంగ్‌ డ్రైవ్స్‌కి వెళ్తుంటాను.

నటిగా మరింత ముందుకు
పవర్‌ఫుల్, ఎమోషనల్‌ పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా నన్ను నేను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement