రొయ్య రైతులను దోచుకుంటున్న కంపెనీలు | - | Sakshi
Sakshi News home page

రొయ్య రైతులను దోచుకుంటున్న కంపెనీలు

Mar 23 2026 8:32 AM | Updated on Mar 23 2026 8:32 AM

వీరవాసరం: రొయ్యల రైతుల సమస్యల పరిష్కారం కోసం వీరవాసరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివి ధ జిల్లాల నుంచి రొయ్యల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు డిమాండ్లు ప్రకటించారు. వీరవా సరం రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మ ల్ల తులసీరామ్‌ (రాంబాబు) అధ్యక్షతన జరిగిన స మావేశంలో జై భారత్‌, క్షీరారామ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు మాట్లాడుతూ ఉత్పత్తులను సాధించడానికి రొయ్య రైతులు ప్రకృతి విపత్తులు, వైరస్‌లతో పోరాడుతుంటే ట్రంప్‌ సుంకాలు, యుద్ధం పేరుతో కంపెనీలు భా రాలు వేస్తున్నాయన్నారు. రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి అథారిటీకి చెప్పకుండానే మేతల ధరలు పెంచారన్నారు. నాణ్యమైన సీడ్‌ లేక 80 శాతం పంటను రైతు లు కోల్పోతున్నారన్నారు. జిల్లా అసోసియేషన్‌ కార్య దర్శి గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ వచ్చిన దిగుబడిలో 90 శాతం పంటను రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారన్నారు. ఒక రొయ్యల మేతల కంపెనీ యజమాని ఎంతకాలం అడుక్కుంటారంటూ రైతులను చులకన చేసి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్ల తులసీరామ్‌ మాట్లాడుతూ పెంచిన ఫీడ్‌ రేట్లు తగ్గించి, తగ్గించిన రొయ్య రేట్లను వెంటనే ఆయా కంపెనీలు సరిచేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆయా ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లను పేర్లతో సహా వెల్లడించి బ్యాన్‌ చేస్తామన్నారు. పాలకొల్లు అసోసియేషన్‌ కార్యదర్శి బోనం వెంకట నరసయ్య (చిన్నబాబు) మాట్లాడు తూ మూడు నెలల పాటు క్రాప్‌ హాలిడేని ప్రకటిస్తే అ ప్పుడు ప్రభుత్వానికి, ఎగుమతిదారులకు రైతులు విలువ తెలుస్తుందన్నారు. అమలాపురానికి చెందిన నాగభూషణం, అప్సడా సభ్యుడు వేగేశ్న సత్యనారాయరాజు, ఐ.భీమవరం బోస్‌, వీరవల్లి చంద్రశేఖర్‌, బోగిరెడ్డి శ్రీనివాస్‌, సీహెచ్‌ నాగభూషణం, ఎన్‌.గజపతిరాజు, గాదిరాజు శ్రీనివాసరాజు, కలిగొట్ల యు వరాజు, సజ్జా బుజ్జి, రమేష్‌ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

సదస్సులో నినదించిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement