ఇప్పటికే మూడుసార్లు సమావేశం వాయిదా వేశారు. ఆదివారం ఆగమేఘాల మీద సమావేశం నిర్వహించారు. కోరంకు అవసరమైన సభ్యులు హాజరు కాలేదు. అయినా అధికారుల సమక్షంలోనే చైర్‌పర్సన్ సమావేశం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిని మేం ప్రశ్నించాం. అందుకే మమ్మల్ని సస్పెండ్ చేస్తామంటూ అవమానకరంగా హెచ్చరించారు. ప్రశ్నించే సభ్యులు లేకుండా చూసి పలు తీర్మానాలకు ఆమోదం చేసుకుంటున్నారు.
– ఎం నీరజ, చింతలపూడి, జెడ్పీటీసీ
కొంతకాలంగా సమావేశానికి హాజరైన సభ్యుల నుంచి ముందుగానే సంతకాలు సేకరించి అజెండాలో లేని పనులకు తీర్మానాలు చేసినట్టుగా చూపుతున్నారు. తీర్మానాల్లో చాలా అవకతవకలు జరిగాయి. వీటికి మేం బాధ్యులం కాకూడదనే సంతకాలు చేయలేదు. అజెండా అంశాలు చర్చించిన తర్వాతే రిజిస్టర్‌లో సంతకాలు చేస్తామన్నాం. దీనికి చైర్‌పర్సన్ ఒప్పుకోలేదు. పనుల వివరాలు అడిగినా ఇవ్వడం లేదు.
– కర్రి గౌరీసుభాిషిణి, పెనుమంట్ర, జెడ్పీటీసీ
కొంతకాలంగా జెడ్పీ నిధులు పక్కదారి పడుతున్నాయి. దీనిపై మేం ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదు. గత సమావేశాల్లో సభ్యులు ఆమోదించిన తీర్మానాలు కాకుండా, తప్పుడు మార్గంలో తీర్మానాలు చేస్తున్నారు. ఈ తీర్మానాలు ద్వారా పనులు ఇష్టానుసారంగా చేపట్టి, నిధులు కాజేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అందుకే న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నాం.
– గుంటూరి పెద్దిరాజు, పోడూరు జెడ్పీటీసీ


