వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అక్కసుతో అధికారు లు, పాలకులు ప్రజలను కష్టాల పాల్జేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్లినిక్‌లు, రైతు భరోసా భవనాలు నిర్మించారు. వీటిలో 90 శాతం భవనాలు అందుబాటులో వచ్చాయి. మరో 10 శాతం భవనాలకు విద్యుత్, తాగునీటి సౌ కర్యం కల్పిస్తే ఉపయోగంలోకి వస్తాయి. అయితే అధికారులు నేటికీ ఆయా భవనాలకు విద్యుత్, వాటర్ సప్లయ్ కనెక్షన్ ఇవ్వడం లేదు. దీనివల్ల పేదలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. దీనిపై శాసనమండలిలో సైతం ప్రశ్నించాను. అయినా ఫలితం కానరావడం లేదు.
– వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ


