బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు
న్యూస్‌రీల్
జిల్లాలో 1,22,665 మందికి..
నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి
విచారణ చేపట్టాలి
గత ప్రభుత్వ బ్యాగులే దిక్కు
యథేచ్ఛగా కలప తరలింపు
కన్నాపురం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అడవిలో చెట్లను కొట్టి కలపను అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. 10లో u
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో శనివారం ఉదయం 11.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. 10లో u
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పథకాలను కాపీ కొట్టి, ఆయా పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విద్యాకానుక పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు మార్చి అ మలు చేస్తోంది. అంతటి మహోన్నత వ్యక్తి పేరు పె ట్టిన ఈ పథకాన్ని చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అంతా భావించారు. అ యి తే ఆ పేరుకే తీవ్ర అవమానం కలిగేలా అమలు చే స్తున్నారంటూ విద్యారంగ నిపుణులు వాపోతున్నారు.
మూడు నెలలకే మూలకు..
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో పాఠశాలల విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అందించిన బ్యాగులు మూడు నెలలకే మూ లకు చేరాయి. ఏ మాత్రం నాణ్యత లేకపోవడంతో విద్యార్థుల చేతికి వచ్చిన కొద్ది రోజులకే చిరిగిపోయి, జిప్పులు ఊడిపోయి, హ్యాండిల్స్ తెగి పోయి అస్తవ్యస్తంగా మారాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిన ధర కంటే అధికంగా చెల్లించినా ఆ స్థాయి నాణ్యత లేని బ్యాగులు పంపిణీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెదవి విరుస్తున్నారు.
కుట్టించుకున్నా పనిచేయని వైనం
సాధారణంగా స్కూల్ బ్యాగులు, ట్రావెల్ బ్యా గులు కొత్తవి కొంటే కనీసం రెండేళ్లపాటు బాగుంటాయి. నాణ్యత తక్కువ ఉన్న బ్యాగులైతే కనీసం ఏడెనిమిది నెలల పాటు పనిచేస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది అందించిన బ్యాగులు మాత్రం కేవలం మూడు నెలలకే పాడైపోయాయి. ఈ బ్యాగుల పేరుతో భారీ కుంభకోణమే జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాడైన బ్యాగులను కుట్టించుకుని వినియోగించుకుందామని ప్రయత్నించినా విద్యార్థులకు అది కూడా సాధ్యపడటం లేదు. కొందరు చిరిగిపోయిన ఈ బ్యాగులను కుట్టించుకుని వినియోగించడానికి ప్రయత్నించగా అవి చీకిపోవడంతో కొత్తగా వేయించుకున్న కుట్లు సైతం ఊడిపోవడం, బ్యాగులు చీకిపోవడంతో కుట్లు కూడా పడకపోవడంతో వాటిని దూరంగా విసిరేసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు కొత్తవి కొని వాడుకుంటున్నారు.
చిరిగిపోయిన స్కూల్ బ్యాగులతో పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు
జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో 1,22,665 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన యాజమాన్యాల్లోని పాఠశాలల్లో మొత్తం 1,19,397 మంది విద్యార్థులే చదువుతున్నారు. అయితే బ్యాగుల పంపిణీ కంటే విద్యార్థుల సంఖ్య 3,268 తక్కువగా ఉండటం గమనార్హం.
చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు అస్సలు నాణ్యత లేవు. బ్యాగులను పంపిణీ చేసిన కాంట్రాక్టర్, వాటిని పర్యవేక్షించిన అధికారులు దీనికి బాధ్యత వహించాలి. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
బ్యాగుల నాణ్యత లేమిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అలాగే బ్యాగులు పంపిణీ చేసిన కాంట్రాక్టర్‌కు చెందిన సంస్థను వచ్చే ఏడాది బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టును ఆ సంస్థకు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
– కె.లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
స్కూల్ బ్యాగ్.. లేదు బాగు
మూడు నెలలకే మూలకు చేరిన విద్యార్థి మిత్ర బ్యాగులు
కుట్టించుకున్నా పనిచేయని వైనం
జిల్లాలో 1,22,665 మందికి పంపిణీ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులే దిక్కు
2024 కంటే ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికీ కొందరు విద్యార్థులు వి నియోగిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు తమ వద్ద ఉన్న గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను వినియోగించడం చూస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతటి నాణ్యమైన బ్యాగులు ఇచ్చారో అర్థం చేసుకోవచ్చని విద్యార్థి సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు
బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు
బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు
బ్యాగ్ మీద ఒట్టు.. నాణ్యత తీసికట్టు


