పుంజుకుంటున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పుంజుకుంటున్నాయ్‌

Dec 13 2025 7:46 AM | Updated on Dec 13 2025 7:46 AM

పుంజు

పుంజుకుంటున్నాయ్‌

ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నా యి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమ యం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసానికుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి.

మెలకువలతో శిక్షణ : పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేర్పిస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు.

ఆహా ఏమి భోగం : బాదంపప్పు, జీడిపప్పు, మటన్‌ కై మా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్‌ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్‌ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్‌ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు.

శిక్షకులకు డిమాండ్‌

కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్‌ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నారు.

కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు.

గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు.

కోట్లాటకు రెడీ

కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ

బలవర్ధక ఆహారం

నెల రోజుల్లో బరిలోకి..

రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా ధర

పుంజుకుంటున్నాయ్‌ 1
1/1

పుంజుకుంటున్నాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement