కదం తొక్కిన అంగన్‌వాడీలు
ఏలూరు (టూటౌన్): అంగన్‌వాడీలకు కనీస వేత నం రూ.26 వేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుండి వందలాది మంది అంగన్‌వాడీలు తరలివచ్చారు. ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుంచి ప్రదర్శనగా జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు పి.భారతి అధ్యక్షతన జ రిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఆరేళ్లుగా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా పలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన త ర్వాత వాటిని పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. యాప్‌ల పేరుతో పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం మాట్లాడారు. అనంతరం డీఆర్వోకి వినతిపత్రం అందజేశారు.
ఇఫ్టూ ఆధ్వర్యంలో..
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మూ డు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చే శారు. ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు బి.శిరోమణి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొ మ రం మారమ్మ, జిల్లా కన్వీనర్ పాల్గొని మాట్లాడారు.


