కాంట్రాక్ట్ కార్మికులకు పనిభారం
భీమవరం: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి అపరిష్కృత సమస్యలను పరిష్కారించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భా గంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెల్లబోయిన మాట్లాడుతూ పారిశుద్ధ్య కా ర్మికులకు పెండింగ్ వేతనాలను జమచేయకపోవ డం దారుణమని, కనీస వేతనం రూ.26 వేలు ఇ వ్వాలని, ఈస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పడకల స్థాయికి అనుగుణంగా కార్మికులను నియమించాలన్నారు. ఫినాయిలు, గ్లౌజులు, చీపుర్లు, మాస్కులు అందించాలని డిమాండ్ చేశా రు. ఏఐటీయూసీ నాయకులు వైవీ ఆనంద్, ఎం. లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


