సందడిగా హేలాపురి బాలోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హేలాపురి బాలోత్సవాలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుమూడి కోటేశ్వరరావు జాతీయ జెండాను, బాలోత్సవ పతాకాన్ని ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఉద్యోగాలు సాధించిన వేలేరుపాడుకి చెందిన నాగుల మంగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరేళ్లుగా హేలాపురి బాలోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. బాలల్లో సృజనను వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. తొలిరోజు 350 పాఠశాలల నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. 53 విభాగాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు జరిగాయి. సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు, వీజీఎంవీఆర్ కృష్ణారావు, మహమ్మద్ అలీ, ఎమ్మెస్ కాంతారావు, హేలాపురి కళాకారుల సంఘం అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, మేతర అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సందడిగా హేలాపురి బాలోత్సవం


