జ్యోతిర్లింగార్చన
భీమవరం (ప్రకాశంచౌక్): పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. జ్యోతిర్లింగార్చన నేత్రపర్వమైంది.
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల స మస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయు) ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రిటైర్ అయిన, సర్వీసులో చనిపోయిన ఆప్కాస్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆప్కాస్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని, నిత్యం గ్యాంగ్ వర్కులు రద్దుచేసి పనిభారం తగ్గించాలని, పర్మినెంట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ సరెండర్ లీవులు, డీఏలు, ఇంక్రిమెంట్లు, యూనిఫారాలు వెంటనే ఇవ్వాలని, కార్మికులు పనిచేయడానికి కా వాల్సిన పనిముట్లు ఇవ్వాలని కోరుతూ వివిధ సర్కిళ్లకు చెందిన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. సోమయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఉమ్మడి జిల్లాల కార్యదర్శి బద్దా వెంకటరావు, ఇఫ్టూ నగర కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, బీఓసీ అధ్యక్షుడు నెహ్రూబాబు మాట్లాడారు.


