పచ్చనేత భూకబ్జా
ఆగిరిపల్లి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగేవారు లేకపోవడంతో మండలంలో భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మండలంలో నెక్కలం గొల్లగూడెంలో టీడీపీ నేత సుమారు రూ.50 లక్షల విలువైన ఎకరా భూమిని ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామంలో కరెంట్ ఆఫీస్ రోడ్డులోని మల్లయ్యగట్టు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎకరా భూమి ఖాళీగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిపై స్థానిక నేత కన్నేశారు. కొన్నిరోజుల క్రితం భూమి చుట్టూ ఫె న్సింగ్ వేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


