రేషన్ బియ్యం పట్టివేత
కామవరపుకోట: మండలంలోని తడికలపూడి శివారులో వ్యాన్‌లో తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యా న్ని విజిలెన్స్స్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి పట్టుకున్నారు. 43.40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు గుర్తించి డ్రైవర్‌ను ప్రశ్నించారు. తడికలపూడి కి చెందిన ఈడుపుగంటి శ్రీనివాసరావు పాత రైస్‌మిల్ నుంచి పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామానికి చెందిన చోడిశెట్టి మహేష్, చోడిశెట్టి సతీష్‌లకు తరలిస్తున్నట్టు తెలిపాడు. తనిఖీల్లో రూ.1,73,600 విలువైన బియ్యం, రూ.5 లక్షల విలువైన వాహనా న్ని సీజ్ చేసి ఈడుపుగంటి శ్రీనివాసరావు, చోడిశెట్టి మహేష్, చోడిశెట్టి సతీష్, డ్రైవర్ ఒబిలిశెట్టి వెంకట సూర్యనారాయణలపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.


