ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
గుబ్బల మంగమ్మను
దర్శించుకున్న భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
పెద్దింట్లమ్మా..
దీవెనలందించమ్మా
కై కలూరు: అమ్మా.. కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు ఆర్తీతో అమ్మను వేడుకున్నారు. అమ్మవారి దేవస్థానానికి సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ఆదివారం రోజున రూ.23,365 ఆదాయం వచ్చిందని తెలిపారు.
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, కళాభిమాని కుందా శాస్త్రి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పలువురు వక్తలు బాలు సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. చరణ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలు అభిమానులు, కళాకారులు, మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, జెట్టి గురునాథరావు, కరాటం రాంబాబు, జెడ్పీటీసీ పోలనాటి బాబ్జి, కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, దాసరి శేషు తదితరులు పాల్గొన్నారు.
1/3
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
2/3
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
3/3
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ