ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక శనివారపుపేట ఉర్దూ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్న ఎస్‌కే అన్వర్ జహాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. అన్వర్ జహాన్‌కు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, ఏలూరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కేవీఎస్ మణి, ఎల్. కనకదుర్గ తదితరులు అభినందనలు తెలిపారు.
ఏలూరు రూరల్: జిల్లా స్థాయి చెస్ పోటీల్లో చిన్నారులు ప్రతిభ చాటారని గ్యారీ కాస్పరోవ్ చెస్ అకాడమీ డైరక్టర్ జి.యోహనాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కశాళాలలో నిర్వహించిన చెస్ పోటీలు వివరాలు వెల్లడించారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ నతానియోలు తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.
ద్వారకాతిరుమల: మండలంలోని వ్యవసాయ భూముల్లో జరుగుతున్న వరుస కాపర్‌వైరు చోరీలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా రామన్నగూడెంలో ఇద్దరు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి, కాపర్ వైర్లను తస్కరించారు. గ్రామానికి చెందిన రైతులు సయ్యద్ బడే సాహెబ్, కొడవగంటి ఆనందరావులు ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి చూసేసరికి ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై టి.సుధీర్ దొంగలు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. చోరీల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.
ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక


