
కుడి కాలువ గట్టుకు తూట్లు
పోలవరం రూరల్: పోలవరం మండలంలో కుడికాలువ వెంట మట్టి, గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటికిల కోట నుంచి రేపల్లెవాడ వరకు కాలువ సమీపంలో పలు చోట్ల అక్రమార్కులు తవ్వుకుపోతున్నా పట్టించుకునే వారులేరు. కాలువ గట్టు వెంట తరలించేస్తున్న అధికారుల కంటపడకపోవడం విశేషం. రేపల్లెవాడ సమీపంలో కుడికాలువ గట్టు పక్కన గావెల్ తవ్వి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. గ్రావెల్ తరలించేస్తున్న విషయాన్ని గ్రామస్తులు ఇంజినీరింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాలువ వెంట తిరుగుతుండగా, ఒక ప్రదేశంలో జేసీబీ, ట్రాక్టర్‌లు ప్రత్యక్షమయ్యాయి. వీటిని అడ్డుకుని అనుమతులు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి జేసీబీ, ట్రాక్టర్‌తో సహా పరారయ్యారు. కాలువ మట్టి తరలిస్తున్నారన్న విషయంపై కుడి కాలువ డీఈ కోటేశ్వరరావును అడగ్గా సిబ్బందిని పంపామని, కాలువ వెంట పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కుడి కాలువ గట్టుకు తూట్లు