
పట్టిసం శివక్షేత్రం కళకళ
పోలవరం రూరల్: కార్తీకమాసం ప్రారంభం కావడంతో అఖండ గోదావరి నది మధ్య గల పట్టిసం శివక్షేత్రం సందర్శనకు భక్తుల రాక ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి పట్టిసం రేవుకు చేరుకుని నదిలో లాంచా దాటి ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది వరద ఉధృతి ఉండటంతో క్షేత్రానికి సమీపం వరకు లాంచీ చేరుకుంది. శివకేశవులకు నిలయమైన ఈ క్షేత్రంలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని, క్షేత్రపాలకుడైన బావన నారాయణస్వామిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పట్టిసం శివక్షేత్రం వద్ద భక్తులను నది దాటించేందుకు నిర్వహించే ఫెర్రీ వేలం పాట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పట్టిసం గ్రామపంచాయతీ అధికారులు నిర్వహించారు. అప్పటి నుంచి ఇంజిన్ పడవపై క్షేత్రానికి భక్తులను తీసుకువెళ్లి తీసుకువచ్చేవారు. పోర్టు అధికారులు ఇచ్చిన అన్ని అనుమతులతో కొత్తగా లాంచీని ఏర్పాటు చేసి భక్తులను నది దాటిస్తున్నారు.
మద్దిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసిన కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ ఈవో ఆర్‌వీ చందన మాట్లాడుతూ కార్తీక మాసోత్సవాలు ఈ నెల బుధవారం నుంచి నవంబర్ 20 వరకు జరుగుతాయని తెలిపారు. బుధవారం ఆలయంలో స్వామికి లక్ష చామంతి పూలతో పుష్పార్చన ఆలయ అర్చకులు, వేద పండితులు, రుత్వికులుచే వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.
శివక్షేత్రానికి వెళ్లేందుకు లాంచీ ఎక్కుతున్న భక్తులు
మద్ది ఆలయంలో లక్ష పుష్పార్చన

పట్టిసం శివక్షేత్రం కళకళ