జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం

Oct 16 2025 5:43 AM | Updated on Oct 16 2025 5:43 AM

జిల్ల

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం విభిన్న ప్రతిభావంతులకు సహకరించాలి వేతన బకాయిలు చెల్లించాలంటూ ధర్నా టీడీపీ నాయకుల నిరసన

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ బిల్డింగ్‌ సముదాయాన్ని హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవితో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఏలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సీతారాం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి మాట్లాడుతూ 2018 నుంచి ఏలూరు కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ నోముల రాముడు, జాయింట్‌ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్‌, కోశాధికారి గండికోట సీతారామరాజు, గద్దె విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో బుధవారం జాతీయ వైట్‌ కేన్‌ దినోత్సవం సందర్భంగా ర్యాలీని కలెక్టర్‌ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని వాటి జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రామ్‌ కుమార్‌, విజువల్లీ చాలెంజెడ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాధారాణి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు జి.డి.వి.ఎస్‌.వీర భద్రరావు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బందికి గత 4 నెలలుగా చెల్లించాల్సిన వేతన బకాయిలు, 10 నెలల పీఎఫ్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఆస్పత్రుల శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ ఫస్ట్‌ ఆబ్జెక్ట్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసి గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

చాట్రాయి: సీసీ రోడ్ల బిల్లులు దుర్వినియోగం చేశారంటూ స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద కృష్ణారావుపాలెంకి చెందిన టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణారావు పాలెంలో 2017లో వేసిన సీసీ రోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేశారంటూ బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయానికి తలుపులు వేసి టీడీపీ నాయకులు రామారావు, ధనలక్ష్మి, నరసింహారావు నిరసన వ్యక్తం చేశారు.

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం 
1
1/3

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం 
2
2/3

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం 
3
3/3

జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement