
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై కూటమి నిర్లక్ష్యం
బుట్టాయగూడెం: అసంపూర్తిగా ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టి పూర్తిచేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ మచిలీపట్న ం పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తె ల్లం బాలరాజు విమర్శించారు. బుట్టాయగూడెం మండలం పద్మవారిగూడెం సమీపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని శుక్రవారం వారు సందర్శించారు. నిధులలేమితో అసంపూర్తిగా పనులు మిగిలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఐదు ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. బుట్టాయగూడెం సమీపంలో ఆస్పత్రి కోసం సు మారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయగా దాదాపు రూ.12 కోట్లతో పనులు జరిగాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం భవన నిర్మాణంపై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే 100 పడకలతోపాటు 60 మంది వైద్యులు అందుబాటులో వస్తారని, దీంతో గిరిజనులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. పనులు పూర్తి చేసేందుకు కూటమి పాలకులు కృషిచేయా లని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీ నర్ అల్లూరి రత్నాజీరావు, సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, జెడ్పీటీసీ మొడియం రామతులసి, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.