ఏలూరు రూరల్: దివ్యాంగుల చేతుల్లో వైకల్యం ఓడింది. వైకల్యం శరీరానికే కాని.. తమ సామర్థ్యానికి కాదని మరోసారి నిరూపించారు. ఆదివారం ఏలూరు భిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్‌పూల్ ఆవరణలో రాష్ట్రస్థాయి 7వ పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. కాళ్లు, చేతులు లేక పోయినా ఈత కొలనులో ఈదుతూ అబ్బురపరిచ్చారు. సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు 20, 40, 60 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మా ట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు అంతర్జాతీయ స్థాయిలో 40కు పైగా పతకాలు సాధించారని కొనియాడారు. దివ్యాంగులకు ఆటలపై ఆసక్తిని పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు పత కాలు అందించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, డీఎస్‌డీఓ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
స్విమ్మింగ్‌లో సత్తాచాటిన దివ్యాంగులు
వైకల్యం ఓడింది