పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట

Oct 13 2025 7:44 AM | Updated on Oct 13 2025 7:44 AM

పారిశ

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట

మంత్రి మాట తప్పారు

ప్రైవేటీకరణ తగదు

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ పేరిట ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించ వద్దు, ప్రయోగాత్మకంగా రెండు డివిజన్లలో అమలు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌కు వినతిపత్రం సైతం అందించారు. సాక్షాత్తూ మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ సొంత నియోజకవర్గం నెల్లూరులో ఈ విధా నాన్ని అమలు చేయబోతే కార్మిక సంఘాల వ్యతిరేకతతో వెనక్కి తగ్గారని నాయకులు గుర్తుచేస్తున్నా రు. కార్మికులను బానిసలుగా మార్చే వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి, ఆప్కాస్‌ ద్వారా మున్సిపల్‌ కార్మికుల నియామకాలను జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మాట తప్పిన మంత్రి

నెల్లూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంగా వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రాష్ట్రంలో మరెక్కడా అమలు చేయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారని కార్మిక సంఘ నా యకులు చెబుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఏలూరు కార్పొరేషన్‌ వన్‌టౌన్‌లో 11వ డివిజన్‌, టూటౌన్‌లో 30 డివిజన్‌లో ఈ విధానాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నారని మండిపడుతున్నారు. ఏలూరు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్‌ కార్మికుల నియామకాలను ఆప్కాస్‌ ద్వారా చేపట్టాలని, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.

ప్రైవేటీకరణతో అస్తవ్యస్తం

పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించడం అంటే ప్రజల ప్రాణాలను బలిపెట్టడమేనని, పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, లేకుంటే నెల్లూరు తరహాలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడుతుందని, కనీస వేతనాలు, కార్మిక చట్టాల అమలుకావని ఆందోళన వ్యక్తం చేశారు.

రేపు ఏలూరులో ధర్నా

వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ విధానం అమలును నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించాలని ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ ధర్నాలో అన్ని సర్కిళ్లకు చెందిన మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అలాగే నగరంలోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని యూనియన్‌ నాయకులు కోరారు.

సాక్షాత్తు మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూ రు మున్సిపాల్టీలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించే సమయంలో సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో రాష్ట్రంలో మరెక్కడా దీనిని అమలు చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని తుంగలోకి తొక్కి ఏలూరు కార్పొరేషన్‌లోని రెండు డివిజన్లలో పారిశుద్ధ్య పనులను వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ప్రైవేటీకరించాలనుకోవడం తగదు.

– డీఎన్‌వీడీ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు

వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నగరంలోని 11,30 డివిజన్లలోని పారిశుద్ధ్య పనులను ప్రై వేటీకరించాలనుకునే విధానాన్ని తక్షణం ని లుపుదల చేయాలి. కార్పొరేషన్‌లోని ఖాళీ లను ఆప్కాస్‌ విధానంలో భర్తీ చేయాలి. అవు ట్‌ సోర్సింగ్‌ విధానం రద్దు చేయాలి. కొన్నేళ్లు గా ఖాళీగా ఉన్న మున్సిపల్‌ కార్మికుల పోస్టుల ను తక్షణం భర్తీ చేయాలి. ఈనెల 14న జరిగే ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలి.

–బి.సోమయ్య,ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు

వర్క్‌ అవుట్‌ సోర్సింగ్‌పై తీవ్ర వ్యతిరేకత

ఏలూరు కార్పొరేషన్‌లో అమలుకు ప్రభుత్వం ప్రయత్నం

భగ్గుమంటున్న కార్మిక సంఘాలు

మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మాట తప్పారంటూ నిరసన

రేపు భారీ ధర్నాకు సన్నాహాలు

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట1
1/3

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట2
2/3

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట3
3/3

పారిశుద్ధ్య కార్మికుల పోరుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement