
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం
కై కలూరు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలను ప్రైవేటుపరం (పీపీపీ) చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆరోపించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 కళాశాలలకు అనుమతులు పొందగా 5 నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రారంభించారని, మరో 2 కళాశాలల ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డువచ్చిందన్నారు. మిగిలిన 10 కాలేజీల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణ లక్ష్యమన్నారు. నవంబరు 22 వరకు రచ్చబండ, సంతకాల సేకరణ, అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాల తరలింపు, నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయాలకు తరలింపు, చివరకు కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శి బలే నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి మొట్రు ఏసుబాబు, కై కలూరు, కలిదిండి, మండవల్లి మండలాల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, తిరుమాని రమేష్, బేతపూడి ఏసేబురాజు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
నేడు కల్తీ మద్యంపై నిరసన
కల్తీ మద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటమడుతున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని డీఎన్నార్ కోరారు. సోమవారం ఎకై ్సజ్, ప్రొహిబిషన్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించే కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయానికి ఉదయం 8 గంటలకు పార్టీ నాయకులు, శ్రేణులు హాజరుకావాలని కోరారు.