
నూజివీడు ఎంఈఓ–2 అదృశ్యం
నూజివీడు: నూజివీడు ఎంఈఓ–2 సంగెపు జమలయ్య ఈనెల 4 నుంచి కనిపించకపోవ డం సంచలనంగా మారింది. ఫోన్ చేస్తే అవు టాఫ్ కవరేజీ అని రావడంతో కుటుంబ సభ్యు ల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జమలయ్య కుమారుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు కట్టినట్టు సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా వి ధులకు గైర్హాజరవుతుండటంతో ఇన్‌చార్జి డీవైఈఓ పీఎస్ సుధాకర్ విచారణ నిర్వహించి ని వేదికను డీఈఓకు అందజేసినట్టు తెలిసింది. జమలయ్య రెండేళ్ల క్రితం గంపలగూడెంలో పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. దసరా సెలవులకు బుల్లెట్ వేసుకుని గంపలగూడెం వెళ్తున్నానని చెప్పిన ఆయన ఈనెల 3 వర కు ఫోన్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది.