
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని పేరంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం పంగిడిగూడెం గ్రామానికి సాదె పెంటమ్మ పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తోంది. బుధవారం విధులు నిమిత్తం పంగిడిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చేందుకు ఆటో ఛార్జీలు లేకపోవడంతో, గ్రామానికే చెందిన తాపీ పని చేస్తున్న ఎం.సతీష్ పని నిమిత్తం మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వస్తుండగా, అతని మోటార్‌సైకిల్‌పై పెంటమ్మ ఎక్కింది. మోటార్‌సైకిల్ పేరంపేట రామాలయం సమీపానికి వచ్చేసరికి అదుపు తప్పడంతో పెంటమ్మ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఆమైపె నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు హుటాహుటిన పెంటమ్మను జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మోటార్‌సైకిల్ నడుపుతున్న సతీష్‌కు గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స అందించారు. పెంటమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి భర్త శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మృతురాలు పెంటమ్మకు భర్త శ్రీనుతోపాటు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భీమవరం: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై ఫజుల్ రహమా న్ తెలిపారు. ఓ కారు మోటర్ సైకిల్‌ను ఢీకొట్టడంతో లంకపేటకు చెందిన బొబ్బనపల్లి హరీష్‌బాబు, కొరాడ లక్ష్మీనారాయణ గాయ పడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.