ఎరువు.. దరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. దరువు

Oct 4 2025 2:04 AM | Updated on Oct 4 2025 2:04 AM

ఎరువు

ఎరువు.. దరువు

ఎరువు.. దరువు ధరలను నియంత్రించాలి

ధరలు (బస్తా రూ.లలో)

ఏలూరు (మెట్రో): ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యూరియా కొరతతో అవస్థలు పడుతున్న రైతుల నెత్తిన ఎరువుల ధరల పెరుగుదల మరో పిడుగులా మారింది. ఓ పక్క ధరల పెరుగుదల, మరోపక్క దుకాణాల్లో ఎమార్పీకి మించి విక్రయించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కారులు, ద్విచక్రవాహనాలు, గృహోపకరాణాలు తదితర వస్తువుల ధరలు తగ్గినా రైతులకు అవసరమయ్యే ఎరువుల ధరలు మాత్రం తగ్గలేదు. రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్నా అన్నదాతల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

ఎరువులు వాడాల్సిన పరిస్థితి

ఏలూరు జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా వేరుశనగ, పెసర, మినుము పంటలను రైతులు సాగు చేస్తున్నారు.

జిల్లాలో వ్యవసాయ సాగు 1,97985 ఎకరాలు ఉండగా, ఉద్యాన పంటల సాగు 2,72,939 ఎకరాలు ఉంది. ఉద్యాన పంటల్లో ప్రధానంగా ఆయిల్‌పామ్‌, కోకో, కొబ్బరి సాగవుతున్నాయి. ప్రస్తుతం పంటలపై వస్తున్న చీడపీడలను తట్టుకునేందుకు, దిగుబడులు వచ్చేందుకు రైతులు తప్పనిసరిగా ఎరువులపై ఆధార పడాల్సిన పరిస్థితి. అయితే ధరల పెరుగుదల వారికి భారంగా మారింది. దుకాణాల్లో ఎమ్మార్పీకి అదనంగా విక్రయించడం మరింత ఇబ్బంది పెడుతోంది. ఎరువుల ధరల నియంత్రణ, ఎమ్మార్పీకి విక్రయించేలా చర్యలు తీసుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందని రైతులు అంటున్నారు.

సాగు చేయాలంటేనే ఎరు వుల ధరలు భయపెడుతున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోతే ఏటా పెట్టుబడులు పెరిగిపోతాయి. రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎరువుల ధరలను నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– రావూరి రవి, రైతు, బాపిరాజుగూడెం

ఎరువు రకం గతం ప్రస్తుతం

20–20–0 1,250 1,350

10–26–26 1,470 1,850

15–15–15 1,450 1,650

14–15–14 1,700 1,850

పొటాష్‌ 1,550 1,800

28–28 1,700 1,850

20–20–0–13 1,300 1,450

24–24 1,700 1,850

రైతులపై ముప్పేట దాడి

ధరల పెరుగుదలతో అన్నదాతలు సతమతం

పట్టించుకోని కూటమి సర్కారు

జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు

ఎరువు.. దరువు 1
1/1

ఎరువు.. దరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement