
సీఈసీనీ లెక్కచేయక..
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ కమిటీ సభ్యులు పర్యటించినా కొల్లేరులో అక్రమ చేపల సాగు యథేచ్చగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అక్రమ చేపల చెరువులకు గండ్లు కొట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారు. చేపల చెరువులకు చిన్నపాటి గండ్లు పెట్టి ఫొటోలు తీసుకున్న తర్వాత అక్రమ సాగుదారులు వెంటనే గండ్లు పూడ్చేశారు. ఏలూరు జిల్లాలో పలు కొల్లేరు గ్రామాల్లో అటవీ శాఖ గండ్లు పెట్టిన చెరువుల్లో దర్జాగా చేపల సాగు జరుగుతోంది. అక్రమ చెరువులు ధ్వంసం చేయడానికి అటవీ సిబ్బంది గ్రామాల్లోకి వెళుతుంటే కొల్లేరులో కూటమి నేతలు మహిళలను ముందు వరుసలో ఉంచి ఆందోళనలు చేయిస్తున్నారు.