
సబ్ జైలు సందర్శన
భీమవరం: భీమవరంలో ప్రత్యేక సబ్ జైలును ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎస్.శ్రీదేవి, సంస్థ సెక్రటరీ కె.రత్నప్రసాద్ సందర్శించారు. ముద్దాయిలు కోరితే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. జైలులో ఏర్పాట్లపై ఆరా తీశారు. రోజూ యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జైలు పరిసరాలను, మహిళా బ్యారక్‌ను, సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్‌ను, వంటశాలను తనిఖీ చేసి, భోజనాన్ని రుచిచూశారు. జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి ఉన్నారు.