
క్షేత్రంలో కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. దసరా ఉత్సవాలు సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శిస్తున్న భవానీ దీక్షాదారులు నేరుగా చిన్నతిరుపతికి చేరుకుంటున్నారు. దాంతో కొండపైన, ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సెల్‌ఫోన్లు భద్రపరచే కౌంటర్ వద్ద భక్తులు బారులు తీరారు. తిరుగు ప్రయాణంలో వారంతా క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

క్షేత్రంలో కొనసాగిన రద్దీ