
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి పెద్దింట్లమ్మకు పొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, వాహన పూజలు, భక్తుల విరాళాల ద్వారా రూ.33,675 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో చెప్పారు.
కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల పూజలు