
యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి
● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స
● గ్రామస్తుల భారీ ఆందోళన.. విరమణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: భీమడోలులో శనివారం రాత్రి గంజాయి ముఠా రెచ్చిపోయి దాడి చేయడంతో ఈతకోట రవికిరణ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు నెలలుగా గ్రామంలో గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ వారికి సర్దిచెప్పేందుకు రాగా ఆయన జీపు ను చుట్టుముట్టారు. 10 మంది గంజాయి ముఠా సభ్యుల్లో పలువురు రవికిరణ్‌పై ఇప్పటికే రెండు సార్లు దాడి చేసినా, చంపేస్తామని బెదరిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఏలూరు డీఎ స్పీ శ్రావణ్‌కుమార్ ఇక్కడకు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా సమస్య తీవ్రతను ఆయనకు తెలియజేశారు. చివరకు అల్లరిమూకలపై కేసులు నమోదుచేస్తామని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాత్రి 10.30 గంటల నుంచి వేకువజాము 2.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ విల్సన్ తెలిపారు.
చవితి ఉత్సవాల్లో గొడవ ప్రారంభం
భీమడోలు గణపతి సెంటర్‌లో నిర్వహించిన వినా యక చవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనోత్స వాన్ని పురస్కరించుకుని ఈనెల 6న పోలీసుల ఆదేశాలతో ఉత్సవ కమిటీ సభ్యులు డీజే సౌండ్స్‌ను నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన కూటమి నాయకులు (గంజాయి బ్యాచ్) గుబ్బాల శివ, వణుకూరి బాలు, నందవరపు ప్రసాద్, ముదరబోయిన సుధాకర్, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ననుబోలు జగదీష్, రామకుర్తి సురేష్, ఆడపా మణికంఠ గంజా యి సేవించి ఉత్సవ కమిటీ సభ్యులను దుర్భాషలాడారు. దీనిపై అదేరోజు రాత్రి ఉత్సవ కమిటీ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 7న ఉత్సవ కమిటీ సభ్యుడు ఈతకోట రవికిరణ్‌పై గుబ్బాల శివ, పిల్లి రాజశేఖర్, ఖాదా శ్రీను, ముదరబోయిన సుధాకర్ దాడి చేశారు. దీనిపై ఎంఎల్‌సీ కేసు నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రవికిరణ్‌పై గంజాయి బ్యాచ్‌కు చెందిన ఇద్దరు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
గంజాయికి అడ్డాగా భీమడోలు
రాష్ట్రంలో గంజాయి తరలింపులో భీమడోలు రెండో స్థానంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. గంజాయికి అడ్డాగా భీమ డోలు మారిందని, దీంతో విద్యార్థుల నుంచి యు వత వరకూ గంజాయికి బానిసలవుతున్నారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి.
పోలీసుల అదుపులో నిందితులు
రవికిరణ్‌పై దాడికి కారణమైన 10 మంది యువకులపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి ఎని మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులు గుబ్బల శివకృష్ణ, జక్కంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఖాజా శ్రీనివాసరావు, పిల్లి రాజశేఖర్, వణుకూరి బాలకృష్ణ, ముదరబోయిన సుధాకర్, నందవరపు ప్రసాద్, అడపా మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. నానుబోలు జగదీష్, రామిశెట్టి సురేష్ పరారీలో ఉన్నట్టు ఇన్‌చార్జి ఎస్సై సుధీర్ ఆదివారం రాత్రి తెలిపారు.

యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి