
మంత్రి పదవి కోసమే జగన్‌పై కామినేని ఆరోపణలు
కై కలూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీ వేదికగా తిడితే సీఎం చంద్రబాబు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవి కేటాయిస్తారనే భ్రమలో ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్లకార్డులను ఆదివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి పాలనలో జరిగే ప్రతి అన్యాయం, అక్రమాలు, మైనింగ్‌లను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలన్నారు. డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫొటోలు, ఆధారాలు, అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉందన్నారు. దీనిలో ఐవీఆర్‌ఎస్ నంబరు 040–49171718 కాల్ చేసి ఫిర్యా దులు చేయవచ్చన్నారు.
డీఎన్నార్ పేరు చెబితే కామినేనికి నిద్ర పట్టడం లేదు
తన పేరు చెబితే ఎమ్మెల్యే కామినేనికి నిద్రపట్టం లేదని డీఎన్నార్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి పద వి కోసం కాకా పట్టడం కోసమే వైఎస్ జగన్‌పై కామినేని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వీటిపై విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పష్టత ఇవ్వడంతో కామినేని పన్నాగం అర్థమయిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి కేటాయించకపోవడం, డిప్యూటీ పవన్ కల్యాణ్‌కు ఉన్న గన్‌మెన్లు, బౌన్సర్లు చూసి తట్టుకోలేక సైకోలా మాట్లాడుతున్నారని ధ్వ జమెత్తారు. అసలు ఈ గొడవలకు ప్రధాన కారణం కామినేని శ్రీనివాస్ అని విమ్శరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రా మిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర నా యకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ఎంప్లాయీస్ అండ్ ఫెన్సనర్ల విభాగ అధ్యక్షుడు ఎలుగుల వేణుగోపాలరావు, మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్