
గోపాలకృష్ణకి రాష్ట్రస్థాయి అవార్డు
చింతలపూడి: చింతలపూడికి చెందిన కిసాన్ అంగడి వ్యవస్థాపకుడు మరికంటి గోపాలకృష్ణ ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విస్తరణ నిపుణుల రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఏరు వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తాను అవార్డు అందుకున్నట్టు గోపాలకృష్ణ ఆదివారం తెలిపారు. ఎనిమిదేళ్లుగా గోపాలకృష్ణ తన భూమిలోనే ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కిసాన్ అంగడి ద్వారా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహ న, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్ర కృతి వ్యవసాయం మీద నమ్మకంతో ముందుకు సాగుతున్న రైతులందరి విజయం ఈ అవార్డు అని, భవిష్యత్తులో మరింత మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కృషి చేస్తానని గోపాలకృష్ణ అన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఉద్యోగ, ఉపాధ్యాయులు సకాలంలో డీఏలు, పీఆర్‌సీ ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి రామారావు, బి.రెడ్డి దొర ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఐఆర్, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు.
యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక వద్ద కాజ్‌వే మునిగింది. కాజ్‌వేపై నుంచి సుమారు నాలుగడుగుల నీరు ప్రవహించడంతో అధికారులు ఇంజన్ పడవలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది వరదలకు కాజ్‌వే మునగడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగుల నీరు ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల వరకూ కాజ్‌వే ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
సిద్ధాంతంలో..
పెనుగొండ: వశిష్ట గోదావరి నిండుగా ప్ర వహిస్తోంది. రెండు రోజుల్లో సుమారు ఏడడుగుల మేర నీరు పెరిగింది. సిద్ధాంతంలో కేదార్‌ఘాట్, పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోవడానికి కేవలం మూడు మెట్లు మాత్రమే ఉన్నాయి. వరద నీరు సిద్ధాంతం పుష్కరాల రేవులను పూర్తిగా ముంచెత్తింది. పడవలపై రాకపోకలు సాగించే లంక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యస్థ లంకలోకి రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి.

గోపాలకృష్ణకి రాష్ట్రస్థాయి అవార్డు