
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ అధ్యక్షుడు డిజిటల్ బుక్‌ను అందుబాటులోకి తెచ్చారని, అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్లకార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలకు మేలు చేయటమే లక్ష్యంగా పనిచేశారనీ, మరోసారి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు.
కూటమి పాలనలో అన్యాయంగా కేసులు
కూటమి పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేయటం, అక్రమ కేసులతో జైళ్లకు పంపటం, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పటం, వేధింపులకు గురిచేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారనీ డీఎన్నార్ అన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు సరైన రీతిలో న్యాయం చేసేలా డిజిటల్ బుక్ రూపొందించారని చెప్పారు. ఈ డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫొటోలు, ఆధారాలు అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉందన్నారు. దీనిలో ఐవీఆర్‌ఎస్ నంబర్ 040–49171718కి కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ బుక్ పోర్టల్‌పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలనీ, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు.
చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారంటే నూరు శాతం చేసి చూపిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీల అధినేతలకు సైతం జగన్ పట్టుదల, కార్యదీక్ష బాగా తెలుసనీ అన్నారు. కూటమి ప్రభుత్వంలోని అధికారులు, పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తప్పు చేసిన నేతలు, అధికారులను చట్టం ముందు నిలబెట్టి జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు న్యాయం చేస్తారని తెలిపారు.
ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జేవియర్ మాస్టర్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలారపు బుజ్జి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా కార్యదర్శి తులసీ, యువజన విభాగం అధ్యక్షుడు ఘంటా సాయి ప్రదీప్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్ తదితరులు పాల్గొన్నారు.