
అభయాంజనేయస్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి
పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయ స్వామిని హైకోర్టు జడ్జి టి.మల్లికార్జునరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తొలుత అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
రాట్నాలమ్మ సన్నిధిలో..
పెదవేగి: హైకోర్టు జడ్జి టి.మల్లికార్జునరావు దంపతులు రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు.
చింతలపూడి: జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. శనివారం అధికారులు 403 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.62 అడుగులకు, గోనెల వాగు బేసిన్ 347.42 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా 0.655 టీఎంసీలకు, గోనెల వాగు బేసిన్ 1.105 టీఎంసీలకు చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 403 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చని డీఈ తెలిపారు.
బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సహాయ ఉపాధ్యాయుల పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయడానికి ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్టు డీడీ ఎన్.శ్రీవిద్య శనివారం ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 3లోపు తెలపాలని అన్నారు. తదుపరి వచ్చిన అభ్యంతరాలు స్వీకరించమని, అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా ప్రకటించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారులు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు సంస్థలతో రెండు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఫిజిక్స్ వాలా లిమిటెడ్‌తో ఒప్పందం మేరకు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల విద్యార్థులకు 14 కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తారు. వీటిలో వీటిలో గేట్, క్యాట్‌లతో పాటు ప్రొ ఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, సెమినార్లు, వెబి నార్లు, మాక్ పరీక్షలు, మెంటార్ షిప్ ఉంటాయి. అలాగే కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ కాంపెటెన్సీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా పారిశ్రామిక అనుభవం, ఇంటర్న్‌షిప్‌లు, నిపుణుల ఉపన్యాసాలు, వ్యాపార శిక్షణ, వర్చువల్ లెర్నింగ్ అవకాశాల ద్వారా విద్యార్థుల శిక్షణను మెరుగుపరుస్తా రు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయస్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి

అభయాంజనేయస్వామి సన్నిధిలో హైకోర్టు జడ్జి