
ఆది కర్మయోగి అమలుకు కృషి
తణుకులో భారీ చోరీ
ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచుకున్న ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. IIలో u
బుట్టాయగూడెం: జిల్లాలోని 46 గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి పథకాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాజానగరంలోని ఆది సేవా కేంద్రంలో శనివారం ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై సమీక్షించారు. మండలాల వారీగా బుట్టాయగూడెంలో 19, పోలవరంలో 5, జీలుగుమిల్లిలో 5, కుక్కునూరులో 2, వేలేరుపాడులో 9, టి. నర్సాపురంలో 1, చాట్రాయిలో 1, నూజివీడులో 2, చింతలపూడిలో 2 మొత్తం 46 గ్రామాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ డీడీ ఎన్.శ్రీవిద్య పాల్గొన్నారు.