
ట్రిపుల్ ఐటీలకు నేటినుంచి దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు యాజమాన్యం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 6 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. దీంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు శనివారం నుంచే ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నూజివీడు డిపో అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి 41 బస్సులను ఏర్పాటు చేసి దూర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. కొందరు విద్యార్థులు సమీపంలోని విజయవాడ, హనుమాన్ జంక్షన్‌లలో గల రైల్వేస్టేషన్‌లకు చేరుకొని ఇళ్లకు వెళ్తున్నారు.