
నిందితులు పాత నేరస్తులేనా?
చోరీకి గురైన నివాసంలో దొరికిన ఆనవాళ్లతోపాటు సమీపంలోని సీసీ కెమేరాల పుటేజీల ప్రకారం నిందితులను పోలీసు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. భీమవరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిందితుడి ఫొటోతోపాటు వారి వివరాలు విడుదల చేశారు. పాత నేరస్తుడైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగేంద్ర సహాని, మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రామ్ నేరానికి పాల్పడ్డారని, వీరు తెలుపు రంగు కారులో వచ్చి చోరీ సొత్తుతో అదే కారులో ఉడాయించారని వివరించారు. సదరు దొంగలకు సంబంధించిన వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. సీఐ కొండయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫొటో