కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా? | - | Sakshi
Sakshi News home page

కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా?

Sep 27 2025 5:09 AM | Updated on Sep 27 2025 5:09 AM

కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా?

కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా?

కై కలూరు ఎమ్మెల్యే చేపల దొంగ కాదా?

ఏలూరు టౌన్‌: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ చేపల దొంగ కాదా అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) నిలదీశారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కామినేని, బాలకృష్ణ అసందర్భ ప్రేలాపనలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తనకు చెందిన వంద ఎకరాల చేపల చెరువును ఎమ్మెల్యే కామినేనికి సంబంధించిన వ్య క్తులతో అక్రమంగా పట్టించి అమ్ముకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించి ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసెంబ్లీలో పిచ్చి ప్రేలాపనలు చేయడం సరికాదన్నారు. జగన్‌ గురించి నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. కామినేని అసెంబ్లీలో అసందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించారనీ గతంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దలను, చిరంజీవి వంటి వ్యక్తిని, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవమానించారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కామినేని ఏమైనా సినీ నిర్మాతా, దర్శకుడా అని ప్రశ్నించారు. జగన్‌ గురించి లేనిపోని ఆరోపణలు ఎందుకు చేశారని డీఎన్నార్‌ నిలదీశారు.

బాలకృష్ణకు కడుపు మంట

బాలకృష్ణ మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నాడని, మరోవైపు సినీ రంగంలో ప్రత్యర్థి వర్గమైన పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, సెక్యూరిటీ, హడావుడి చూసి కడుపు మంట ఎక్కువ అయ్యిందని డీఎన్నార్‌ అన్నారు. ఎమ్మెల్యేలు కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యలపై విదేశాల్లో ఉన్న చిరంజీవి వెంటనే స్పందిస్తూ పూర్తిస్థాయి వివరాలు వెల్లడించారని, ఆనాడు మాజీ సీఎం జగన్‌ సినీ పెద్దలకు ఏవిధంగా గౌరవం ఇచ్చారో చెప్పడం ద్వారా కామినేనికి చెంప చెల్లుమనిపించారన్నారు. కామినేనికి మంత్రి పదవి కావాలంటే బాబును వేరే విధంగా కాకా పట్టుకోవాలని, అంతేగాని తమ అధినేత వైఎస్‌ జగన్‌ గురించి తప్పుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

రౌడీమూకలను పెంచి పోషిస్తూ..

వరహాపట్నంలో గంజాయి బ్యాచ్‌లకు ఎమ్మెల్యే కామినేని సెటిల్‌మెంట్లు చేస్తున్నారని డీఎన్నార్‌ ఆరోపించారు. ఏలూరు–కై కలూరు రోడ్డులో జరిగిన హత్యాయత్నం కేసులోనూ సెక్షన్లు పెట్టకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కామినేని పెంచి పోషిస్తున్న రౌడీమూకలు దళితవాడలో ఎస్సీలపై దారుణంగా దాడులకు పాల్పడితే, మాట వినలేదనే కారణంగా కై కలూరు టౌన్‌ సీఐ కృష్ణను వీఆర్‌కు పంపింది మీరు కాదా అంటూ విరుచుకుపడ్డారు. మట్టిమా ఫియా, కోడిపందేలు, రౌడీ మూకలకు వత్తాసు ప లుకుతూ కై కలూరు రూరల్‌ సీఐ రవికుమార్‌ ఎ మ్మెల్యే కామినేనికి డబ్బులు వసూలు చేసిపెట్టే అధికారిగా ఉన్నారని ఆరోపించారు. కై కలూరు నియోజకవర్గంలో కామినేని చేసే అక్రమాలు, అవినీతిని డిజిటల్‌ బుక్‌లో ఎక్కిస్తామని, తాము అధికారంలో కి వచ్చాక చట్టం ముందు నిలబెడతామని అన్నారు.

సినీ పరిశ్రమను ఆదుకున్న జగన్‌

ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సినీ పరిశ్రమ నష్టాల్లో, కష్టాల్లో ఉందని చిరంజీవి చెబితే తప్పకుండా ఆదుకుందామని చెప్పి, పెద్ద మనసుతో టికెట్‌ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వటం మర్చిపోయారా బాలకృష్ణ అని ప్రశ్నించారు. జగన్‌పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్‌, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, నాయకులు తులసీ, పల్లి శ్రీనివాస్‌, బుద్దాల రాము, చిలకపాటి డింపుల్‌జాబ్‌, పి.రాజేష్‌, జి.సాయిప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి సెటిల్‌మెంట్లు చేయడం లేదా !

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ నిలదీత

అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని అసందర్భ ప్రేలాపనలపై మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement