
ఉద్యోగులకు మొండిచేయి
ఉద్యోగుల సమస్యలు
శోచనీయం
ఏలూరు(మెట్రో): కూటమి సర్కారు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించకపోవడంతో పాటు ఒక్క డీఏ కూడా మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరకు చేరుతున్నా ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారం, డీఏల మంజూరుపై ఇప్పటికే పలురకాలుగా నిరసనలు తెలుపుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టగా ఏపీ రెవెన్యూ అసోసియేషన్ సైతం ఉద్యమ ఆలోచనలో ఉంది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ నాలు గు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, దసరా సందర్భంగా ఒక్క డీఏ కూడా మంజూరు చేయకపోవడం దారుణమని ఉద్యోగులు అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో
రూ.4 వేల కోట్ల బకాయిలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 67 వేలకుపైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లా 29 వేల మంది పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాలనను వికేంద్రీకరణ చేసి ఉద్యోగులకు ఒత్తిడి లేకుండా, అదే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు కృషి చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మాజీ సీఎం జగన్ 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల కోసం 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పీఆర్‌సీ కమిషన్ సేవలు ప్రారంభించే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో కమిషన్ ఆగిపోయింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిభారం పెంచడంతో పాటు తమను పట్టించుకోవడం లేదనే భావన ఉద్యోగుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.4 వేల కోట్ల వరకూ ఉ న్నాయి. 2024 జనవరిలో 3.64 శాతం, 2024 జూ లైలో 2.73 శాతం, 2025 జనవరిలో 1.82 శాతం, 2025 జూలైలో 2.73 శాతం మొత్తంగా 10.92 శాతం డీఏ బకాయిలు ఉన్నాయి.
ఏపీజీఎల్‌ఐ లోన్, పైనల్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోయాయి.
మూడు సరెండర్ లీవ్‌లు పెండింగ్.
పది నెలల ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ లీవ్‌ల పెండింగ్
ముందుకు కదలని 12వ పీఆర్‌సీ
10 నెలల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల పెండింగ్
2024 అక్టోబర్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ బకాయిలు
డీఏ, పీఆర్‌సీ బకాయిల పెండింగ్
ఐఆర్ ఊసెత్తని ప్రభుత్వం
జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు కూటమి సర్కారు తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అవేమీ పట్టనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. దసరా పండగకై నా డీఏలు ప్రకటిస్తారని ఎదురుచూశాం. కానీ అదేమీ లేదు. కనీసం ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఒక్క డీఏ అయినా ప్రకటించాలి.
– కె.రమేష్‌కుమార్,
జిల్లా రెవెన్యూ శాఖ అధ్యక్షుడు, ఏలూరు
పెండింగ్‌లో నాలుగు డీఏలు
దసరాకూ మంజూరు కాని వైనం!
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 67 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు

ఉద్యోగులకు మొండిచేయి