
మళ్లీ వణికిస్తున్న గోదావరి వరద
వేలేరుపాడు: గోదావరి వరద మళ్లీ ఉగ్రరూపం దా ల్చింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హె చ్చరిక జారీతో మండలంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల్లో గోదావరిలో నీటిమట్టం పెరగడం ఇది ఆరోసారి. దీంతో మండలంలోని 26 గ్రామాలు జలదిగ్బంధనంలోకి వెళ్లాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్లవాగు, ఎద్దెలవాగు, టేకూరు తదితర వా గుల వంతెనలు నీటమునిగాయి. కొయిదా, కాచా రం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్లగొంది, పూసు గొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చి ట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్లపల్లి, పా తనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరుతో పా టు మ రో తొమ్మిది గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి.
కుక్కునూరు మండలంలో..
కుక్కునూరు: మండలంలోని పంట చేలల్లోకి వరద నీరు ప్రవేశించింది. పునరావాస సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు ఇటీవల వరద తగ్గడంతో తమ ఇళ్లకు చేరారు. మరలా వ రద పెరగడంతో ఆందోళన చెందుతున్నారు.