
పోలీసుశాఖకు బొలెరో వాహనం అందజేత
ఏలూరు టౌన్ : ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజారక్షణ పోలీస్ శాఖకు నెక్ట్స్‌జెన్ కంపెనీ యాజమాన్యం సుబ్రహ్మణ్యం నూతన మహీంద్రా బోలెరో వాహనాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌కు బొలెరో వాహనం తాళాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.