
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు క్షేత్రంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయంలో ధ్వజస్తంభం వద్ద చలువ పందిరిని నిర్మించారు. శుక్రవారం గుడి సెంటర్‌లో 40 అడుగుల స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ఆలయ రాజగోపురాలకు, ఆళ్వార్‌ల మండపాలకు, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే క్షేత్రంలో పలు చోట్ల రంగులు వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి.