
హరిత హోటల్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ
ద్వారకాతిరుమల: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలోని హరిత హోటల్స్, రిసార్ట్స్‌ను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీవారి దేవస్థానం గతంలో కొండపైన కోట్లాది రూపాయలు విలువైన భూమిని పర్యాటక అభివృద్ధి సంస్థకు నామమాత్రపు ధరకు విక్రయించగా, అందులో హోటల్ నిర్మించారు. దాన్ని సక్రమంగా నడపలేక గతంలో ఒకసారి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో దేవస్థానం అధికారులు దాన్ని అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న సాక్షిలో శ్రీటెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావులు స్పందించారు. ఈ క్రమంలో టూరిజానికి సంబంధించిన ఫైల్‌ను పరిశీలించిన ఈఓ, ఈనెల 21న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చే సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో ఈ అంశంపై చర్చించడంతో ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఏది ఏమైనా కొండపైన భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కావడం మంచిది కాదని, అది క్షేత్ర పవిత్రతకు, భద్రతకు ముప్పని శ్రీవారి భక్తులు అంటున్నారు.

హరిత హోటల్ ప్రైవేటీకరణ అంశంపై చర్చ