
బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే
భీమవరం: రాష్ట్రంలో బీసీ కులాలను అణగదొక్కాలని చూస్తున్నారని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తామని నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ గుత్తుల తులసీగురి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ గంగారామ్ అన్నారు. గురువారం భీమవరంలో నేషనల్ బీసీ సమాఖ్య సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ కులాలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి, బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా గుత్తుల తులసీగురి, ఉపాధ్యక్షుడిగా మోపాటీ బలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొంగ కృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎం.విజయ్ ఎన్నికకాగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్ గంగారామ్, కండిబోయిన సుబ్ర హ్మణ్యం, ఉపాధ్యక్షునిగా కొమ్మోజు కన్నబాబు, జాయింట్ సెక్రటరీ గుబ్బల నాగేశ్వరరావు, ప్రచార కమిటీ చైర్మన్‌గా వాస రామ ఎన్నికయ్యారు.