కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు | - | Sakshi
Sakshi News home page

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు

Sep 26 2025 7:09 AM | Updated on Sep 26 2025 7:09 AM

కై కల

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు

న్యూస్‌రీల్‌

తెలంగాణలో కేసులు

కొల్లేరు అడ్డాగా పందేలు

శురకవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కొత్త ట్రెండ్‌ ప్రారంభమైంది. కోడిపందేలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఖ్యాతిగాంచింది. గత రెండు, మూడేళ్ల నుంచి జిల్లాలో ఒక ప్రాంతంలో పందులతో పందేలు నిర్వహించిన పందేలరాయుళ్లు తెలంగాణలో నిషేధించిన పొట్టేళ్ల పందాలకు జిల్లాను అడ్డాగా మారుస్తున్నారు. ప్రధానంగా కై కలూరు నియోజకవర్గంలోని కొల్లేరు చెరువు గట్లను పందెం అడ్డాలుగా మారుస్తూ లక్షల్లో పందేలు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతలు కాసులు దండుకుంటూ అనేక మంది జేబులు గుల్ల చేస్తున్నారు. జిల్లాలో సంక్రాంతి సమ యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. హైకోర్టు నిషేధాజ్ఞలు ఉన్నా పోలీసులు హడావిడి చేసినా ఏమీ లెక్కచేయకుండా అధికార పార్టీ ముసుగులో భారీగా కోడిపందేలు నిర్వహిస్తుంటారు. జూన్‌ నుంచే పందెం కోళ్లకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహించి పందెం కోళ్లను సన్నద్ధం చేస్తుంటారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కై కలూరు ప్రాంతంలోని కొల్లేరులో ఉన్న చేపల చెరువు గట్ల వద్ద భారీ జీతాలతో ట్రైనర్లను నియమించి ప్రత్యేక బ్రీడ్‌ పందెం పుంజులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంటారు. అలాంటి శిక్షణా కేంద్రాలే బెట్టింగ్‌ అడ్డాలుగా మారుతున్నాయి. పేకాట శిబిరం, కోడి పందేల బదులు పొట్టేళ్ల పందేలకు తెరతీయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్వా చెరువులు ఉండటంతో పోలీసుల హడావిడి ఉండదంటూ ఇతర ప్రాంతాల నుంచి జూదరులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా చెరువు గట్లపై పొట్టేళ్ల పందేలను సైతం నిర్వహిస్తూ బరితెగింపునకు తెరలేపుతున్నారు. ఒక్కొక్క పందెం కనీసం రూ.లక్ష నుంచి పొట్టేలు స్థాయిని బట్టి రూ.3 లక్షల వరకు కూడా కాస్తున్నారు.

జిల్లాలో సంక్రాంతి వంటి పెద్ద పండుగలకే పరిమితమైన కోడిపందేలు, పేకాట, పొట్టేళ్ల పందేలు కూటమి నేతలకు ఇప్పుడు నిత్య ఆదాయ వనరుగా మారిపోయాయి. చేపల చెరువు గట్లపై గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. కై కలూరులో రోజంతా ప్రజాప్రతినిధి వెంట తిరుగుతూ రాత్రి సమయంలో టిప్పర్ల మైనింగ్‌ అవతారం ఎత్తే నేత తాజాగా పొట్టేళ్ల పందేలకు శ్రీకారం చుట్టాడు. పోలీసు శాఖపై కూడా ఇతనికే పెత్తనం చేసే పని అప్పగించడంతో ఇతని వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇతని చెరువు గట్టుపై వేసే ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. శని, ఆదివారాల్లో పొట్టేళ్ల పందేలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు పొట్టేళ్లు కొమ్ములతో కొట్టుకుంటూ ఏది పారిపోతే అది ఓడిపోయినట్టు లెక్క. కోడిపందేలకు అలవాటు పడిన వ్యసనపరులు తెలియని పొట్టేళ్ల పందేలలో రూ.లక్షలు తగలేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు.

బెట్టింగులతో పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తే తెలంగాణలో కేసులు నమోదు చేస్తారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి కై కలూరు నియోజకవర్గం చావలిపాడులో కోడిపందేలతో పాటు పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 150 పొట్టేళ్లను తీసుకొచ్చారు. గొప్ప కోసం ఓ కూటమి నేత మహిళలతో కూడిన 30 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఆకర్షించాడు. దీంతో పొట్టేళ్ల పందేలకు వచ్చిన క్రేజ్‌ను కూటమి నేతలు ఉపయోగించుకుంటున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సంక్రాంతికి పొట్టేళ్ల పందేలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏడాది వరకు వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పొట్టేళ్ల సంస్కృతిని తీసుకొస్తున్నారు.

కొల్లేరు చెరువు గట్లు కేంద్రంగా నిత్యం నిర్వహణ

ఒక్కొక్క పందెం రూ.లక్ష నుంచి ప్రారంభం

ఉమ్మడి పశ్చిమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

పందేల మాటున భారీగా వసూళ్లకు పాల్పడుతున్న కూటమి నేతలు

కోడిపందేల కంటే ముందుగానే పొట్టేళ్ల పందేలతో హడావుడి

కృష్ణా, పశ్చిమగోదావరి నుంచి నిత్యం పందేలరాయుళ్లు కై కలూరుకు రాక

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లోని 122 గ్రామాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. సరస్సు సమీపంలో లక్షలాది ఎకరాల్లో చేపల చెరువుల సాగు చేస్తున్నారు. ఇవే పేకాట జూదరులకు అవకాశంగా మారుతున్నాయి. చెరువుల్లో వేసే మేతల నిల్వ కోసం, కాపలాదారుల కోసం గృహాలు నిర్మిస్తారు. కొందరు చెరువు వద్ద విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, భీమవరం నుంచి ఏలూరు జిల్లా సరిహద్దు కై కలూరు మండలంలో ఉప్పుటేరు సమీపంలోని చేపల చెరువులపై పేకాట శిబిరాలు జరుగుతున్నాయి. పోలీసులు డ్రోన్లు ఎగురవేసి మమ అనిపిస్తున్నారు. పొట్టేళ్ల పందేల నిర్వహణపై కై కలూరు సీఐ కృష్ణను వివరణ కోరగా.. పొట్టేళ్ల పందేలపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు 1
1/2

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు 2
2/2

కై కలూరు.. పొట్టేళ్ల పందేల జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement