
మరీ ఇంత దారుణమా !
ప్రముఖ క్షేత్రానికి వెళ్లే రహదారి మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా. అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకున్నారా. కనీసం గుంతలన్నా పూడ్చాలి కధ. కారుల్లో రావడమే ఇంత కష్టంగా ఉంటే.. ఇక బైక్‌లపై వచ్చే భక్తుల పరిస్థితి ఏమిటి. దీన్ని బట్టి చూస్తే ఆ చినవెంకన్న ఆశీస్సులు ఉంటేనే భక్తులు క్షేమంగా వచ్చి తిరిగి వెళతారు.
– ఉప్పాల శ్రీనివాస్, భక్తుడు, విజయవాడ
శ్రీవారి క్షేత్రానికి బైక్‌పై వెళుతున్నాను. గుంతల రహదారిపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. పెద్దపెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతో అవి ఎంత లోతు ఉన్నాయో తెలియడం లేదు. పగటి వేళే ఇలా ఉంటే, రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణం కష్టమే. రోడ్డు మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలి.
– కొంకిమళ్ల సతీష్, భక్తుడు, దేవులపల్లి, జంగారెడ్డిగూడెం మండలం
రోడ్డు అధ్వానంగా ఉండడంతో శ్రీవారి క్షేత్రానికి బైక్‌లపై వెళ్లే కొందరు భక్తులు గొల్లగూడెం వద్ద మా కళ్ల ముందే పడిపోతున్నారు. వారం రోజుల క్రితం రోడ్డు మధ్యలోని గుంతను తప్పించబోయి, రోడ్డు పక్కనున్న సిమెంట్ బల్లను కారు ఢీకొట్టింది. రెండు రోజుల క్రితం బైక్‌పై వెళుతున్న ఒక భక్తుడి కుటుంబం పడిపోవడంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది.
– తోట అయ్యప్ప, గొల్లగూడెం, ద్వారకాతిరుమల మండలం

మరీ ఇంత దారుణమా !

మరీ ఇంత దారుణమా !