ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత

Sep 26 2025 6:22 AM | Updated on Sep 26 2025 6:22 AM

ఫుడ్‌

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత ప్రతి వ్యక్తికీ జీవిత బీమా తప్పనిసరి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలకు హేమంత్‌శ్రీ ఎంపిక

కామవరపుకోట: ఫుడ్‌ పాయిజన్‌ వల్ల ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం కొత్తూరు యానాదుల కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం యానాదుల కాలనీకు చెందిన పొట్లూరి రమేష్‌, రమణ దంపతుల కుమారుడు మనోజ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, కుమార్తె రేణుకమ్మ సమీప అంగన్‌వాడి కేంద్రానికి వెళుతుంది. ఈ క్రమంలో మనోజ్‌కి సెలవులు కావడంతో గురువారం అన్నా చెల్లెలు ఇద్దరు ఇంటిదగ్గర భోజనం చేసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ కొంతసేపటికి ఇద్దరికీ వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ఇద్దరు పిల్లలకు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందని నిర్ధారించి చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలవరం రూరల్‌: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ బషీర్‌ తెలిపారు. పోలవరం మండలంలోని పాత పట్టిసీమ గ్రామంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బషీర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్‌ ఖాతాలను సమయానికి రీ–కేవైసీ చేయించుకోవాలని, తద్వారా లావాదేవీల్లో ఎటువంటి అంతరాయం లేకుండా సులభంగా సేవలు పొందవచ్చని సూచించారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే వివిధ బీమా పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్‌డీవో నవీన్‌, కెనరా బ్యాంక్‌ డీజీఎం మాధవరావు, ఎస్‌బీఐ డీజీఎం పంకజ్‌ కుమార్‌, ఆర్‌ఎం రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: చైనాలో నిర్వహించనున్న జూనియర్‌ ఏషియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు తణుకు శ్రీచిట్టూరి సుబ్బారావు గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ క్రీడాకారుడు సమ్మెట్ల హేమంత్‌శ్రీ ఎంపికై నట్లు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు చిట్టూరి సత్య ఉషారాణి తెలిపారు. ఈ నెల 13 నుంచి 21 వరకు హర్యానాలో పంచకుల నగరంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజేతగా నిలిచి చాంపియన్‌షిప్‌లో పోటీల్లో పాల్గొనే జట్టులో చోటు సంపాదించినట్లు వివరించారు. అక్టోబర్‌ 21 నుంచి 26 వరకు చైనాలో జరిగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీలకు హేమంత్‌శ్రీ వెళ్లనున్నట్లు అసోసియేషన్‌ సెక్రటరీ మెంటే వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హేమంత్‌శ్రీని కళాశాల జాయింట్‌ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, చిట్టూరి రీనాసాయి, కోచ్‌లు సమ్మెట్ల సతీష్‌బాబు యు.సుదర్శన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.రత్నకుమారి అభినందించారు.

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత 1
1/2

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత 2
2/2

ఫుడ్‌ పాయిజన్‌తో ఇద్దరు పిల్లలకు అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement