కొయ్యలగూడెం: ఎర్రకాలువ గేట్లు ఎత్తడంతో కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపాలెం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య బుధవారం రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీలోని ఎగువ కురిసిన భారీ వర్షాలతో ఎర్రకాలువ జలాశయం నిండింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎర్రకాలువ ఉధృతి కొనసాగింది. రెండు మండలాల మధ్య ఉన్న కల్వర్టుకి ఇరువైపులా రెవెన్యూ సిబ్బందిని గస్తీకి నియమించారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బిల్లులు పెండింగ్‌లో ఉంటే పిల్లలకు వండిపెట్టడం కష్టమని మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు 3,200 మంది పనిచేస్తున్నారని కార్మికుల కుటుంబాలు గడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఐదో తేదీలోపు బిల్లులు చెల్లించాలన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా మినీ చార్జీలు రూ.20కు పెంచాలన్నారు. ధర్నా అనంతరం డీఆర్‌ఓ విశ్వేశ్వరరావుకు వినతి పత్రం అందించారు.

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

ఉప్పొంగిన ఎర్రకాలువ