
●మాకెందుకీ అవస్థలు!
మెగా డీఎస్సీ ఉద్యోగాల పబ్లిసిటీ కోసం రాష్ట్రంలో ఎంపికై న ఉపాధ్యాయులకు మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో నియామకపత్రాలు అందచేయడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇస్తామని చేసిన పబ్లిసిటీ నూతన గురువులకు అవస్థలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో 1146 మంది ఎంపికై న ఉపాధ్యాయులకు, సహాయకులకు కలిపి ఏలూరు నగరంలో వివిధ పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేశారు. తీరా వచ్చి చూస్తే సరైన వసతులు లేక, నేలపైనే టార్పాలిన్‌పై పడుకున్నారు. పాఠశాలల్లో సుమారు 300 మందికి సరిపడా బాత్‌రూమ్‌లు లేక వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారులతో నియామకపు పత్రాలు అందచేస్తే ఏ ఇబ్బందులు ఉండవుకదా.. పబ్లిసిటీ కోసం మమ్మల్ని బలి చేస్తారా? అంటూ ఎంపికై న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు

●మాకెందుకీ అవస్థలు!

●మాకెందుకీ అవస్థలు!