
వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలి
ఏలూరు (టూటౌన్): అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పేస్కేల్ వర్తించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.సురేష్, ఎస్‌ఎస్ శ్రీను, ఎన్.షారోన్ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలి