
ఎరువుల కొరతపై నిరసన
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎరువుల కొరత నివారించాలని కోరుతూ ఆదివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లోని ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ కార్యాలయంలో రైతులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, కసిరెడ్డి శివలు మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం నుంచి తెచ్చుకోకుండా రైతులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని వాపోయారు. మోసకారి మాటలతో ఎరువులు వాడకాన్ని తగ్గించుకుంటే బస్తాకు రూ.800 ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలు పది శాతం తక్కువ ఎరువులకు ఆమోదించాయని, కానీ చంద్రబాబు 20 శాతం తగ్గించుకోవడానికి రూ.500 కోట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.